
విరబూసిన వెన్నెల పుష్పం ..
మది మీటిన మోహనరాగం..
నడిరాతిరి సుందర స్వప్నం..
కలవరమున కదిలెను నయనం..
చిగురించెను చిరు దరహాసం..
చెలి అందెల చిక్కెను హృదయం..
వణికించెను జివ్వున అధరం..
పలికించెను మానసగీతం..
అది ఏదో తెలియని భావం..
యద లోపల ఎదిగిన బంధం..
తెలుపక నిలువలేని ప్రాణం..
తెలుపబోతే మనసే మౌనం ....
No comments:
Post a Comment