Monday, July 20, 2009



అష్టవిధముల అల్లికలతొ అలరించు నీ భావం

పిల్ల గాలి పరుగులతొ పరవశించు నీ భావం

మరులుగొలుపు మయూరమే నాట్యమాడ నీ భావం

విరులెన్నొ పరిమళించ వికసించే నీ భావం

బండరాతి కొండనైన కరిగించే నీ భావం

పసిపాపలు పవలించగ లాలించే నీ భావం

శ్రమ జీవులు శయనించగ సేదదీర్చు నీ భావం

విప్లవాగ్ని ప్రజ్వరిల్ల స్పూర్తినిచ్చు నీ భావం

జన వాహిని జపియించగ జగమెరిగిన నీభావం

నా పదముల గమనానికి దారి చూపు నీ భావం.....

Saturday, July 18, 2009




విరబూసిన వెన్నెల పుష్పం ..
మది మీటిన మోహనరాగం..
నడిరాతిరి సుందర స్వప్నం..
కలవరమున కదిలెను నయనం..
చిగురించెను చిరు దరహాసం..
చెలి అందెల చిక్కెను హృదయం..
ణికించెను జివ్వున అధరం..
పలికించెను మానసగీతం..
అది ఏదో తెలియని భావం..
యద లోపల ఎదిగిన బంధం..
తెలుపక నిలువలేని ప్రాణం..
తెలుపబోతే మనసే మౌనం ....


Monday, July 6, 2009

కమ్మని నీ స్నేహం



అలిసిన నా కన్నుల్లో ఓ కమ్మని కల నీ స్నేహం

మూగబోయిన నా పెదవుల పై ఓ చిరునవ్వు నీ స్నేహం

ఆగక సాగే నా పయనం లో ఓ చల్లని మజిలి నీ స్నేహం

నా హృదయపు ప్రతి స్పందనకూ... ప్రతిస్పందన నీ స్నేహం ... :)

Saturday, July 4, 2009

నను కదిపిన నేస్తం




చెలి పలుకుల చల్లని భావం

కదిలించెను ఝల్లని హృదయం

మురిపించిన మానసగీతం

కురిపించిన వెన్నెల వర్షం

తనదేనా కోయిల గానం

నిజమాయెను వీనుల స్వప్నం

మదిమీటిన కమ్మని కావ్యం

తను పాడిన స్నేహగీతం







Saturday, June 27, 2009

నా విరహం


గుండె రేకులు చీల్చివేస్తూ ..
స్వప్న సౌధం కూల్చివేస్తూ..

అత్మనయనం తొలిచివేస్తూ..
హృదయమును రణభూమి చేస్తూ..

ఎచటికో నువు పయనమౌతూ..
నేను నీకై ఎదురు చూస్తూ ....

అప్పట్లో నేను :p


నువ్వు వర్షించే మేఘమైతే
నిను కదిపే రాగం నేనవనా
నువ్వు ఎగిసే కెరటం అయితే
నువ్వు చేరే తీరం నే కానా

నువ్వు విరిసే పుష్పమైతే
నిన్ను చేరే తుమ్మెదవనా