Saturday, June 27, 2009

నా విరహం


గుండె రేకులు చీల్చివేస్తూ ..
స్వప్న సౌధం కూల్చివేస్తూ..

అత్మనయనం తొలిచివేస్తూ..
హృదయమును రణభూమి చేస్తూ..

ఎచటికో నువు పయనమౌతూ..
నేను నీకై ఎదురు చూస్తూ ....

అప్పట్లో నేను :p


నువ్వు వర్షించే మేఘమైతే
నిను కదిపే రాగం నేనవనా
నువ్వు ఎగిసే కెరటం అయితే
నువ్వు చేరే తీరం నే కానా

నువ్వు విరిసే పుష్పమైతే
నిన్ను చేరే తుమ్మెదవనా